: సినీ నటులకు ఆదర్శంగా నిలుస్తున్న నాగశౌర్య


పేర్ల పక్కన స్టార్ లు తగిలించుకుని, సమాజం నుంచి ఆదరణ పొంది కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్లు తీసుకునే నటులకు వర్ధమాన నటుడు నాగశౌర్య ఆదర్శంగా నిలుస్తున్నాడు. సాటి మనిషి కష్టాలకు స్పందిస్తున్నాడు. సమాజం నుంచి తీసుకోవడమే కాదు, సమాజానికి ఇవ్వడం కూడా బాధ్యతేనని తన చేతలతో సూచిస్తున్నాడు. రైతు ఆత్మహత్యలపై స్పందించి 50 వేల రూపాయలు విరాళంగా అందజేసిన నాగశౌర్య, నెల తిరక్కుండానే కాశ్మీర్ లో తీవ్రవాదుల కాల్పుల్లో మరణించిన వీరజవాను కుటుంబానికి 50 వేల రూపాయలు అందజేసి గొప్ప మనసు చాటుకున్నాడు. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన సత్యం కాశ్మీర్ లో తీవ్రవాదుల కాల్పుల్లో మృతిచెందారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సత్యం కుటుంబాన్ని పరామర్శించి, వారికి 50 వేల రూపాయలు అందజేసి వారిని ఓదార్చారు. షూటింగ్ లో ఉన్న కారణంగా ఘటన జరిగిన వెంటనే రాలేకపోయానని ఆయన వారికి వివరణ ఇచ్చారు. తన తండ్రి శంకరప్రసాద్ స్పూర్తితో సామాజిక సంఘటనలపై స్పందించడం అలవాటైందని నాగశౌర్య తెలిపాడు.

  • Loading...

More Telugu News