: షారూఖ్ తో నటించడం ఆనందంగా ఉంది: తమన్నా
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తో నటించడం ఆనందంగా ఉందని ప్రముఖ టాలీవుడ్ నటి తమన్నా ట్విట్టర్లో పేర్కొంది. తమన్నా ఏ సినిమాలో షారూఖ్ ఖాన్ తో నటిస్తోందని ఆలోచించకండి. మిల్కీబ్యూటీ బాద్షాతో సినిమాలో నటించడం లేదు. ఓ వాణిజ్య ప్రకటనలో బాద్షాతో కలిసి తమ్మూ నటించింది. ఈ సందర్భంగా ఓ ఫోటోను ట్వీట్టర్లో పోస్టు చేసింది. 'ఇట్స్ ఫ్యాన్ టైమ్, అభిమాన నటుడు షారూఖ్ తో నటించడం ఎంతో స్పూర్తినిచ్చింది. ఆయనతో నటించడం ఆనందంగా ఉంది' అంటూ ట్వీట్ చేసింది. ఈ ఫోటో తమన్నా అభిమానులను అలరిస్తోంది.