: ‘ఫోర్స్-2’ షూటింగులో జాన్ అబ్రహాంకు గాయాలు..సర్జరీ చేసిన వైద్యులు


‘ఫోర్స్-2’ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్ తెరకెక్కిస్తుండగా బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం గాయపడ్డారు. ఆయన మోకాలుకి తీవ్రంగా దెబ్బ తగిలింది. దానికి వైద్యులు చిన్న శస్త్రచికిత్స నిర్వహించి, గడ్డకట్టిన రక్తాన్ని తొలగించారు. అయితే, వెంటనే షూటింగ్ లో పాల్గొనేందుకు జాన్ అబ్రహాం రెడీ అయినప్పటికి, ఆ చిత్ర దర్శకుడు అభినయ్ దేవ్ మాత్రం ఒప్పుకోలేదు. బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పాడు. గాయం పూర్తిగా తగ్గిన తర్వాతే తిరిగి షూటింగ్ చేద్దామని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం హంగేరిలోని బుడాపెస్ట్ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. కాగా, జాన్ అబ్రహాం నటించిన ఫోర్స్ సినిమాకు సీక్వెల్ గా ఫోర్స్-2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News