: వీవీఎస్ లక్ష్మణ్ ను ఆటపట్టించిన మాజీ సహచరులు, కామెంటేటర్లు
టీమిండియా దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ను మాజీ సహచరులు, కామెంటేటర్లు సరదాగా ఆటపట్టించిన ఘటన క్రికెట్ అభిమానుల పెదాలపై నవ్వు తెప్పిస్తోంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో నిన్న జరగాల్సి టీట్వంటీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. అయితే అవుట్ ఫీల్డ్ పరిశీలించేందుకు మూడు సార్లు స్టేడియంలోకి వెళ్లిన అంపైర్లు రాత్రి 9:30 నిమిషాలకు ఆట రాద్దాయినట్టు ప్రకటించారు. మ్యాచ్ ఆలస్యం కావడంతో రెండు జట్ల బలాబలాలు, ప్రణాళికలపై వీవీఎస్ లక్ష్మణ్ విశ్లేషించాడు. ఈ సందర్భంగా అతను వేసుకున్న షర్ట్ అందర్నీ ఆకట్టుకుంది. కొట్టొచ్చినట్టు కనిపించే నీలిరంగుపై పిచ్చుకలు కూర్చున్నట్టుగా ఆ షర్టును డిజైనర్లు తయారు చేశారు. ఈ షర్టుతో లక్ష్మణ్ అక్కడున్న అందర్నీ ఆకర్షించాడు. దీంతో కామెంటేటర్లు అతని షర్టుపై చర్చ ప్రారంభించారు. మ్యాచ్ ఆలస్యం కావడంతో డ్రెస్సింగ్ రూంలో ఉన్న ఆటగాళ్లు కూడా లక్ష్మణ్ షర్టును, జరగుతున్న చర్చను విన్నారు. దీంతో లక్ష్మణ్ మాజీ సహచరులైన ధోనీ, హర్భజన్, కోహ్లీ వంటి వారు లక్ష్మణ్ 'వీ లవ్ యువర్ షర్ట్' అంటూ ప్లకార్డు పట్టుకున్నారు. దీనిని టీవీలు ప్రసారం చేయడంతో అభిమనులు హాయిగా నవ్వుకున్నారు.