: మరో టైటిల్ కు అడుగు దూరంలో సానియా మీర్జా


వరుస విజయాలతో దూసుకుపోతున్న సానియా మీర్జా - మార్టినా హింగిస్ జంట మరో టైటిల్ దిశగా దూసుకుపోతోంది. చైనా ఓపెన్ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్ కు మరో అడుగు దూరంలో నిలిచింది. ఈ రోజు జరిగిన సెమీ ఫైనల్లో సానియా జోడీ చైనాకు చెందిన లియాంగ్-వాంగ్ జోడీపై 6-2, 6-3 తేడాతో జయకేతనం ఎగుర వేశారు. ఇప్పటికే యూఎస్ ఓపెన్, వింబుల్డన్ లతో పాటు ఏడు టైటిల్స్ ను సానియా-హింగిస్ జోడీ తమ ఖాతాలో వేసుకుంది. గత మూడు టోర్నమెంట్లలో ఒక్క సెట్ ను కూడా కోల్పోకుండా సానియా జోడీ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది.

  • Loading...

More Telugu News