: 'నేషనల్ డైలాగ్ క్వార్టెట్' సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం


ట్యునీషియాలోని 'నేషనల్ డైలాగ్ క్వార్టెట్' సంస్థకు ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం లభించింది. బహుళ ప్రజాస్వామ్య నిర్మాణానికి సహకారం అందించినందుకు గాను ఈ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినట్టు నోబెల్ కమిటీ తెలిపింది. పురస్కారం కింద 8 మిలియన్ల స్వీడిష్ క్రౌన్లను (972,000 డాలర్లు)ను ఇవ్వనున్నారు. 2011లో ట్యునీషియాలో జాస్మిన్ ఉద్యమం నేపథ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించేందుకు నేషనల్ డైలాగ్ క్వార్టెట్ విశేష కృషి చేసిందని నోబెల్ కమిటీ ప్రశంసించింది. ఈ పురస్కార పోటీలో 273 మందిని వెనక్కి నెట్టి ట్యునీషియా బృందం అవార్డును దక్కించుకుంది. ఈ పోటీలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్, పోప్ ఫ్రాన్సిస్ లు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News