: ఈ నెల 14 నుంచి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 నుంచి 22 వరకు జరగనున్నట్టు జేఈవో కె.శ్రీనివాసరాజు తెలిపారు. ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని చెప్పారు. అర్బన్ ఎస్పీ గోపినాధ్ తో కలసి జేఈవో ఇవాళ ఏర్పాట్లను పరిశీలించారు. మాఢ వీధులలోని గ్యాలరీల్లో స్వల్ప మార్పులు చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, ఉత్సవాల సమయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కుదించినట్టు తెలిపారు. శ్రీవారి గరుడ వాహనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. రేపటి నుంచి పాఠశాలలకు దసరా సెలవుల నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉందన్నారు.