: నన్ను ఏకాకిగా ఉంచొద్దు : ఇంద్రాణి ముఖర్జియా
‘జైలులో నన్ను ఏకాకిగా ఉంచొద్దు. ఒంటరిగా ఉంచడం వల్ల నాలో డిప్రెషన్ మరింత పెరుగుతోంది. నా మానసిక స్థితిని ఇది ఇంకా దెబ్బతీస్తుంది’ అని షీనా బోరా హత్య కేసులో నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా జైలు అధికారులకు చెప్పింది. జైల్లో ఉన్న ఇంద్రాణిని జైళ్ల శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టరు విజయ్ సత్బీర్ సింగ్ కలిసినప్పుడు ఈ విషయం చెప్పినట్లు సమాచారం. ఇంద్రాణి అనారోగ్య పరిస్థితుల రీత్యా ఆమెను వేరే సెల్ కు తరలించనున్నట్లు పోలీసు వర్గాల సమాచారం.