: నేటి నుంచి బాపట్ల వ్యవసాయ కళాశాల మూసివేత


ఇప్పటికే గుంటూరు జిల్లా బాపట్ల వ్యవసాయ కళాశాల హాస్టళ్లను మూసివేయగా, నేటి నుంచి కళాశాల కూడా బంద్ అవుతోంది. విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ నుంచి ఈ నెల 25 వరకు కళాశాలను మూసివేస్తున్నట్టు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. గత నెలలో సూర్యారావు అనే ఎంఎస్సీ ఏజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు కొంతమంది అధ్యాపకులను బదిలీ చేయాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే కళాశాలకు, హాస్టళ్లకు 25వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. కళాశాలను మూసివేయడాన్ని మరోవైపు విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు.

  • Loading...

More Telugu News