: బీజేపీ హామీ విని పకపకా నవ్విన నితీష్ కుమార్


బీజేపీ ఇస్తున్న హామీలు తనకెంతో నవ్వు తెప్పిస్తున్నాయని, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. 9, 10 తరగతుల్లో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థినులకు ద్విచక్ర వాహనాలను ఇస్తామని బీజేపీ హామీ ఇవ్వడం వారి అమాయకత్వానికి నిదర్శనమని అన్నారు. తొమ్మిదో తరగతి బాలికలంటే, 13 నుంచి 14 ఏళ్ల వయసుంటుంది. వారికి డ్రైవింగ్ లైసెన్స్ లు ఇవ్వరన్న కనీస ఇంగితజ్ఞానం లేకుండా వారు హామీలు ఇస్తున్నారని పకపకా నవ్వుతూ ఎద్దేవా చేశారు. గయ జిల్లాలో జరిగిన ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, మీ పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకు నడిపించాలని వారు భావిస్తున్నారు. తాము నడిపించిన పథకాలను కాపీ కొడుతున్నారని, తమ ప్రభుత్వం బాలబాలికలకు సైకిళ్లను పంపిణీ చేయగా, దాన్ని కాపీ కొట్టి ఇప్పుడు టూ వీలర్ లను ఇస్తామని అంటున్నారని ఆయన విమర్శించారు. టూ వీలర్ లతో పాటు ల్యాప్ టాప్ లు, కలర్ టీవీలను ఇస్తామని బీజేపీ ఇస్తున్న హామీలన్నీ నీటిపై మాటలని, వాటిని నమ్మవద్దని తెలిపారు.

  • Loading...

More Telugu News