: కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ పై దాడి కేసు


ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు అమ్మరాజశేఖర్ పై హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. తనపై రాజశేఖర్ దాడి చేశారని ఆరోపిస్తూ వెంకటరెడ్డి అనే జిమ్ ట్రైనర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎల్లారెడ్డిగూడలో నివాసముండే రాజశేఖర్ ఫ్లాట్ కింది అంతస్తులో కోటిరెడ్డి అలియాస్ వెంకటరెడ్డి అద్దెకు ఉంటున్నాడు. టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టారనే విషయంలో పోయిన ఆదివారం వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దాంతో వెంకట్ ఇంటిని ఖాళీ చేశాడు. మిగిలిన వస్తువులు తెచ్చుకునేందుకు తన స్నేహితుడుతో కలసి నిన్న (గురువారం) అక్కడికి వెళ్లాడు. ఇది తెలిసిన రాజశేఖర్ వారిని తన గదికి పిలిపించి అకారణంగా దాడి చేశాడని బాధితుడు వెంకట్ ఫిర్యాదులో చెప్పినట్టు పోలీసులు తెలిపారు. దానిపై రాజశేఖర్ మాట్లాడుతూ, తాను ఎవరిపైన దాడి చేయలేదన్నారు. తన డ్రైవర్ ను ఏకారణం లేకుండా జిమ్ ట్రైనర్ కొట్టాడని అంటున్నారు.

  • Loading...

More Telugu News