: ఢిల్లీలో సైబరాబాదు ఖాకీల సోదాలు... నైజీరియన్ వద్ద రూ.10 కోట్ల డ్రగ్స్ పట్టివేత


దేశ రాజధాని ఢిల్లీలో హైదరాబాదు పరిధిలోని సైబరాబాదు పోలీసులు నేరస్తుల కోసం ముమ్మర సోదాలు చేస్తున్నారు. ఇటీవల వెలుగుచూసిన ఓ ఆన్ లైన్ మోసానికి సంబంధించి నేరగాళ్ల కోసం ఢిల్లీ వెళ్లిన సైబరాబాదు పోలీసులు నిన్న ఓ పెద్ద స్మగ్లర్ ను అరెస్ట్ చేశారు. సోదాల్లో భాగంగా నైజీరియాకు చెందిన వ్యక్తి నివాసముంటున్న ఇంటిలోకి వెళ్లిన సైబరాబాదు పోలీసులకు అక్కడ భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు లభించాయి. సదరు డ్రగ్స్ విలువ దాదాపు రూ.10 కోట్లు ఉంటుందట. దీంతో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు జాన్ పేరిట చెలామణి అవుతున్న సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News