: ముగ్గురు పసిపిల్లలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు!
ఈ దసరా, దీపావళి సీజనులో టపాకాయలు కాల్చవద్దని ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చెవులు దిబ్బళ్లు పడేలా శబ్దాలను తాము వినలేమంటూ, ముగ్గురు పసిపిల్లల తరఫున దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, ఆదర్శ్ కుమార్ గోయల్ తో కూడిన ధర్మాసనం, తాము నోటీసుల వరకూ మాత్రం జారీ చేయగలమని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ కేసులో ఉత్తర్వులు ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని వివరించింది. కాలుష్య నియంత్రణ బోర్డుకు నోటీసులు ఇస్తామని మాత్రం వెల్లడించింది. కాగా, చిన్నారుల తరఫున ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ వాదనలు వినిపించడం విశేషం.