: గంటలో ఫోన్ డెలివరీ చేయలేకపోతే ఫోన్ ఫ్రీ


ఆన్ లైన్ లో ఫోన్ బుక్ చేసిన గంటలో డెలివరీ చేయలేని పక్షంలో ఆ ఫోన్ ఉచితంగా ఇచ్చేస్తామని ఓ కంపెనీ ప్రకటించింది. సాధారణంగా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన వస్తువులు ఇంటికి చేరాలంటే కనీసం రెండు రోజుల సమయం పడుతుంది. అలాంటిది 'వన్ ప్లస్' మాత్రం కేవలం గంటలో డెలివరీ చేస్తామంటోంది. వన్ ప్లస్ మొబైల్ సంస్థ తమ నూతన ప్రోడక్టు వన్ ప్లస్ వన్ మొబైల్ ఫోన్ ను ప్రచారం చేసేందుకు సరికొత్త ప్రచారానికి తెరతీసింది. ఈ ఆఫర్ కేవలం బెంగళూరు వాసులకు మాత్రమే పరిమితమని ప్రకటిచింది. అది కూడా బ్లోహార్న్ మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేసిన తమ వన్ ప్లస్ వన్ మొబైల్స్ కు మాత్రమే పరిమితమని స్పష్టం చేసింది. ఈ ఆఫర్ ను ప్రస్తుతానికి బెంగళూరుకే పరిమితం చేసినా, త్వరలో ఇతర ప్రధాన నగరాలకు కూడా విస్తరిస్తామని వన్ ప్లస్ సంస్థ చెబుతోంది.

  • Loading...

More Telugu News