: డిసెంబర్ లో నా కూతురు పెళ్లి చేస్తా... ఆ తర్వాత కేసీఆర్ పెళ్లి చేస్తా: రేవంత్


తెలంగాణలో కేసీఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తోందని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ విధానాల వల్లే ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు కాంగ్రెస్ తో కలసి ముందుకు సాగుతున్నామని చెప్పారు. మీకు ముఖ్యమంత్రి ఉంటే, మాకు ప్రధానమంత్రి ఉన్నారని టీఆర్ఎస్ శ్రేణులను హెచ్చరించారు. డిసెంబర్ లో తన కూతురి పెళ్లి చేస్తానని... ఆ తర్వాత కేసీఆర్ పెళ్లి చేస్తానని రేవంత్ హెచ్చరించారు. నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ఈ రోజు టీడీపీ, బీజేపీలు మహాధర్నా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి టీటీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, మండవ వెంకటేశ్వరరావు, బీజేపీ నేతలు డాక్టర్ లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News