: సోనియా, చంద్రబాబులు కలసి జగన్ ను జైలుకు పంపారు: రోజా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చంద్రబాబు చేయికలిపి, జగన్ ను జైలుకు పంపారని ఆరోపించారు. రాష్ట్ర విభజన కూడా చంద్రబాబు కుట్రే అని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు 40 ఏళ్ల వయసున్న జగన్ ను చూసి వణుకుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం జగన్ చేపట్టిన దీక్షను చూసి టీడీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయిందని అన్నారు. ఎలాగైనా జగన్ దీక్షను ఆపాలని చంద్రబాబు యత్నిస్తున్నారని... దీక్షను ఆపడం ఆయన తరం కాదని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువచ్చే వరకు టీడీపీ నేతలను గ్రామాల్లోకి అడుగుపెట్టనివ్వరాదంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.