: లంకె బిందెలో వజ్రాలు లేవు... అంతా నీరు, మట్టే!
నిన్నటి నుంచి తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూసిన పాలమూరు జిల్లా గద్వాల వాసులు నేటి ఉదయం ఊసురోమన్నారు. వజ్ర వైఢూర్యాలు ఉన్నాయనుకున్న లంకె బిందెలో నీళ్లు, మట్టి మాత్రమే ఉన్నాయట. దీంతో 24 గంటలకు పైగా సాగిన తీవ్ర ఉత్కంఠ ఒక్క నిమిషంలో చల్లారిపోయింది. గద్వాల పట్టణంలో కాలువల తవ్వకాల్లో బయటపడ్డ లంకె బిందెలో వజ్రాలు, వైఢూర్యాలున్నాయన్న ప్రచారం సాగింది. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ శాఖాధికారులు లంకె బిందెను స్వాధీనం చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితం ప్రజల సమక్షంలోనే అధికారులు లంకె బిందె మూత తీశారు. బిందెలో నీళ్లు, మట్టి మాత్రమే బయటపడ్డాయట. దీంతో ఏముందోనని అక్కడికి వచ్చిన జనం మట్టి, నీటిని చూసి ఊసురోమంటూ ఇంటిదారి పట్టారు.