: కోలుకున్న రోశయ్య.. చెన్నై పయనం
ఈ ఉదయం అస్వస్థతకు గురైన తమిళనాడు గవర్నర్ రోశయ్య కోలుకున్నారు. నేడు కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఆర్యవైశ్య సంఘం సమావేశాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రోశయ్య అక్కడ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన అధికారులు హుటాహుటీన ఆయన్ను విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో వైద్య సేవల అనంతరం కోలుకున్న రోశయ్య ఈ సాయంత్రం చెన్నై బయల్దేరి వెళ్ళారు.