: సింగరేణి బొగ్గుగని కార్మికులకు రూ.48,500 చొప్పున దీపావళి బోనస్


కొత్తగూడెం సింగరేణి బొగ్గుగని కార్మికులకు దీపావళి బోనస్ ఇచ్చేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఒప్పుకుంది. ఈ మేరకు కోల్ ఇండియా ఛైర్మన్ సుతీర్థ భట్టాచార్య, సింగరేణి సీఎండీ శ్రీధర్, జాతీయ కార్మిక సంఘాల నేతలు, బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతినిధులు చర్చించారు. బోనస్ ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. ఈ మేరకు కార్మికులకు రూ.48,500 చొప్పున బోనస్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న 58,263 మంది కార్మికులు, అధికారులకు ఈ బోనస్ వర్తిస్తుంది. గతేడాది రూ.40 వేల బోనస్ చెల్లించగా ఈసారి అదనంగా రూ.8,500 పెంచి ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ చెల్లించాలన్న అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News