: బంగాళాఖాతంలో అల్పపీడనం... నేడు, రేపు భారీ వర్షాలు!


బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ సాయంత్రానికి ఇది మరింతగా బలపడే అవకాశాలు ఉన్నాయని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం ఈ ఉదయం వెల్లడించింది. మరోవైపు లక్షద్వీప్ పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని తెలిపింది. వీటి కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వివరించింది. రాగల 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని తెలియజేసింది. కాగా, గత రాత్రి కడప జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పాగేరు వాగు పొంగిపొర్లుతుండగా, కమలాపురం-ఖాజీపేట మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉయ్యాలవాడ వద్ద కుందరవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షం పడింది.

  • Loading...

More Telugu News