: టీడీపీ నా సొంతిల్లు... అక్కడ స్వేచ్ఛ ఉండేది: అసంతృప్తిలో ‘మాధవరం’


తెలంగాణలో టీడీపీ తరపున గెలిచి, ఆ తర్వాత సొంత పార్టీకి హ్యాండిచ్చి, అధికార పార్టీ గూటికి చేరిన టీడీపీ మాజీ నేత, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర అసంతృప్తిలో కొట్టుమిట్టాడుతున్నారట. టీడీపీలో ఉండగా, కాస్తంత స్వేచ్ఛగా మసలిన ఆయన ప్రస్తుతం గులాబీ పార్టీలో ఇమడలేకపోతున్నారట. టీఆర్ఎస్ పార్టీలో కుదురుకోవడానికి ఇంకా సమయం పడుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. నిన్న అసెంబ్లీ లాబీల్లో ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక ప్రతినిధితో మాట్లాడిన కృష్ణారావు టీడీపీని తన సొంతింటిగా అభివర్ణించారు. ‘‘టీడీపీ నా సొంతిల్లు. అక్కడ స్వేచ్ఛ ఉండేది. టీఆర్ఎస్ లో అందుకు భిన్నమైన వాతావరణం ఉంది. ఇక్కడ సర్దుకునేందుకు ఇంకా సమయం పడుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News