: పాప్ స్టార్ ను ముద్దాడిన శ్రీదేవి తనయ!


అలనాటి అందాల నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్, పాప్ స్టార్ జాక్ గిలినిస్కీని ముద్డాడింది. ఆ ఫొటోను ఇన్ స్టా గ్రాంలోని తన అకౌంట్ లో స్వయంగా ఖుషీ కపూరే పోస్ట్ చేసింది. ఇది మూడు నెలల క్రితం నాటి ఫొటో అని కూడా పేర్కొంది. పాప్ స్టార్ బుగ్గలపై ఖుషీ ముద్దుపెడుతున్న ఈ ఫొటోకు ‘హ్యాండ్స్ డౌన్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్’ అనే ఒక క్యాప్షన్ కూడా ఖుషీ తగిలించింది. కాగా, శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి సినిమా రంగప్రవేశంపై వస్తున్న పలు వదంతులను ఆమె ఇటీవల ఖండించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News