: జగన్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభం
గుంటూరు సమీపంలోని నల్లపాడులో వైకాపా అధినేత జగన్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభమైంది. ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఆయన దీక్షకు దిగారు. హైదరాబాదు నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకున్న జగన్... తొలుత బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం, మధ్యాహ్నం 2 గంటలకు దీక్షా స్థలికి చేరుకున్నారు. జగన్ నిరాహార దీక్ష సందర్భంగా, ఆయనకు మద్దతు తెలిపేందుకు భారీ సంఖ్యలో వైకాపా కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు.