: మంగళగిరిలోనే ఎయిమ్స్... కేంద్ర మంత్రివర్గం నిర్ణయం
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఏర్పాటుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇంతకుముందు అనుకున్నట్లుగానే గుంటూరు జిల్లా మంగళగిరిలోనే ఈ ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థ ఏర్పాటు కానుంది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. నేటి ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఏపీ సహా మూడు రాష్ట్రాల్లో ఎయిమ్స్ ఏర్పాటుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి.