: జగన్ ది దొంగ దీక్ష, కొంగ జపం: టీడీపీ నేత వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు
ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న ‘నల్లపాడు’ దీక్షపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ దొంగ దీక్ష చేస్తున్నారని విరుచుకుపడ్డ రామయ్య, ప్రతిపక్ష నేతది కొంగ జపమేనని దునుమాడారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేతకు అసలు అవగాహనే లేదని ఆయన ఆరోపించారు. గుంటూరులోని నల్లపాడు దీక్షలో కూర్చున్నది దోపిడీ ముఠా అని కూడా రామయ్య ధ్వజమెత్తారు.