: రోడ్డు మార్గంలో జగన్ వెళ్లడానికి కారణం ఇదే


వైకాపా అధినేత జగన్ ఈ రోజు గుంటూరులో దీక్ష చేపడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో ఆయన ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం, హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ కు విమానంలో ఆయన వెళ్లాల్సి ఉంది. అయితే, విమానాశ్రయానికి జగన్ లేట్ గా వచ్చారు. దీంతో, అప్పటికే ఆయన ప్రయాణించాల్సిన విమానం వెళ్లిపోయింది. ఈ క్రమంలో, రోడ్డు మార్గంలోనే ఆయన విజయవాడకు బయల్దేరారు. బెజవాడలో కనకదుర్గమ్మను దర్శించుకున్న తర్వాత, గుంటూరు వెళ్లి దీక్ష చేపడతారు.

  • Loading...

More Telugu News