: నేను రెడీ, మోదీ రెడీయా?: సవాల్ విసిరిన నితీష్ కుమార్


బీహారుకు మూడవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నితీష్ కుమార్ ప్రధాని మోదీకి బహిరంగ సవాల్ విసిరారు. బీహారులో జరిగిన అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని, ఇదే విషయమై మోదీ కూడా చర్చకు అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. పశుమాంసంపై బీజేపీ అనవసర వివాదం సృష్టిస్తున్నదని ఆరోపించిన ఆయన, ఎన్నికల్లో ఆ అంశానికి విలువే లేదని అన్నారు. పక్క రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘటనను చూపిస్తూ, బీహార్ లో ప్రజలను భయాందోళనలకు గురి చేయాలని మోదీ సర్కారు భావిస్తోందని ఆయన విమర్శించారు. ప్రజలను మత విద్వేషాల వైపు నడిపించాలని ఆయన ప్రయత్నిస్తున్నారని, అదే వారి సింగిల్ అజెండా అని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News