: 'ఫబ్బింగ్'తో 'స్మార్ట్'గా వృథా అవుతున్న సమయం!


అత్యంత విలువైన సమయాన్ని స్మార్ట్ ఫోన్లు వృథా చేస్తున్నాయి. రోజువారీ పనుల్లో భాగంగా నిత్యమూ తలమునకలై, వారంలో దొరికే ఒక్క రోజునూ అయినవారితో గడపనీయకుండా 'స్మార్ట్'గా తినేస్తున్నాయి. 'ఫబ్బింగ్' (ఫోన్, స్నబ్బింగ్ లను కలిపి ఇప్పుడు తాజాగా ఫబ్బింగ్ అని అనడం మొదలుపెట్టారు) ఎక్కువై అనుబంధాలు దెబ్బతింటున్నాయని అమెరికాలోని బేలర్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఈ అధ్యయనంలో వెల్లడైంది. జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో గడపాల్సిన సమయాన్ని ఫబ్బింగ్ ఆక్రమించేస్తున్నదట. ఏదైనా ఒక విషయంలో మాట్లాడుతున్న వేళ, యాప్స్ లో వచ్చే మెసేజ్ తీవ్రంగా డిస్ట్రబ్ చేస్తున్నదట. ఏదో మెసేజ్ వచ్చిందని స్మార్ట్ ఫోన్ మోగితే, దాన్ని వినగానే, మాట్లాడుతున్న మాటలను పక్కన పెట్టేలా చేసి, స్మార్ట్ ఫోన్ చేతికి తీసుకుని అసలు విషయాన్ని వదిలి దానిలోనే మునిగిపోతున్నారట. తమ జీవిత భాగస్వామి ఫబ్బింగ్ కారణంగా తమకు అత్యంత అసంతృప్తిగా ఉంటోందని ఈ అధ్యయనంలో పాల్గొన్న అత్యధికులు వెల్లడించారు. దీనివల్ల గొడవలు వస్తున్నాయని 22 శాతం మంది చెబితే, మానసికంగా కుంగిపోతున్నామని 37 శాతం మంది వ్యాఖ్యానించారు. ఈ ఫబ్బింగ్ బాధితుల్లో న్యూయార్క్ మొదటి స్థానంలో ఉండగా, ముంబై 10వ ప్లేస్ లో నిలిచింది. ముంబైలో 33 లక్షల మంది ఫబ్బింగ్ బాధితులు ఉన్నారట. కనీసం వారానికి ఒక్క రోజైనా స్మార్ట్ ఫోన్ ను దూరంగా పెట్టి అనుబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News