: బెంగళూరు 'నిర్భయ' కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు


బెంగళూరు నిర్భయ ఘటనలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. బెంగళూరులో అక్టోబర్ 3 అర్ధరాత్రి కాల్ సెంటర్ ఉద్యోగినిని మాయమాటలు చెప్పి నమ్మించి, వ్యాన్ లో ఎక్కించుకుని కత్తులతో బెదిరించి, కదులుతున్న వ్యాన్ లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల కర్కశత్వానికి అపస్మాకర స్థితికి చేరుకున్న బాధితురాలిని అయ్యప్పస్వామి దేవాలయం వద్ద రోడ్డుపైకి తోసేసి వెళ్లిపోయారు. అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్లు బాధితురాలిని ఆసుపత్రిలో చేర్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వేగంగా స్పందించిన పోలీసులు, కేసు నమోదు చేసి, సీసీపుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి, వ్యాన్ డ్రైవర్, క్లీనర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇంకో నిందితుడ్ని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని వారు తెలిపారు. నిందితులకు ఇంతకు ముందు నేర చరిత్ర లేదని, గత మూడేళ్లుగా బెంగళూరులో నిందితుడు డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News