: వారియర్స్.. బతికిపోయారు!


పుణే వారియర్స్.. పేరులో ఉన్న గాంభీర్యం ఆటలో కనిపించని వేళ.. గేల్ (66 బంతుల్లో 175 నాటౌట్: 13 ఫోర్లు, 17 సిక్సులు) రూపంలో వారిని సునామీ ముంచెత్తింది! బంతి బాబోయ్ అంటోండగా.. బౌలర్లు కెవ్వు కేక పెట్టారు. ఎలా విసిరినా.. బంతి వెళ్ళేది స్టాండ్స్ లోకే అన్నట్టుగా చితకబాదిన గేల్ విధ్వంసాన్ని అభివర్ణించేందుకు ఈ మాటలు చాలవేమో. అసలు, వర్షం కారణంగా మ్యాచ్ సజావుగా సాగుతుందో లేదో అని సందేహించిన క్రికెట్ ఫ్యాన్స్ కు సిసలైన మజా పంచాడీ డాషింగ్ ఓపెనర్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పుణే వారియర్స్ ఇండియా మ్యాచ్ లో పరుగులు వెల్లువెత్తించిన గేల్ ధాటికి పాత రికార్డులు తెరమరుగయ్యాయి.

చివరికి ఓవర్లు పూర్తవడంతో వారియర్స్ బౌలింగ్ కష్టాలకు ముగింపు దొరికింది. అలా సాగింది గేల్ ధ్వంస రచన. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 263 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ లో ఓ జట్టు సాధించిన అత్యధిక స్కోరు. ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ 2010 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ పై 5 వికెట్లకు 246 పరుగులు చేసింది. కాగా, బౌలర్లను, బంతిని ఇష్టారాజ్యంగా శిక్షించిన గేల్ ఫీల్డర్లకు మాత్రం పెద్దగా పని కల్పించలేదు. ఎందుకంటే, గేల్ తన దృష్టంతా సిక్సులు, ఫోర్లపైనే పెట్టడంతో సింగిల్స్ తీసే అవసరం లేకపోయింది.

  • Loading...

More Telugu News