: శ్రీమంతుడు సైకిల్ కావాలా... అయితే, ఇదిగో మార్గం!


సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'శ్రీమంతుడు' సినిమా సూపర్ డూపర్ హిట్టవడమే కాకుండా డబ్బుల వర్షం కూడా కురిపించింది. ఈ చిత్రం ప్రేరణతో సినిమా నటులు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు కొన్ని గ్రామాలను దత్తత కూడా తీసుకున్నారు. అయితే, ఇంత రికార్డు నెలకొల్పిన ఈ సినిమాలో హీరో మహేశ్ బాబు ఉపయోగించిన సైకిల్ ను గెలుచుకునే అవకాశం అభిమానులకు కల్పిస్తున్నట్లు ఫిల్మ్ మేకర్స్ వెల్లడించారు. ఇందుకోసం నిర్వహించే వేలంలో పాల్గొనదలచిన వారు www.iamsrimanthudu.com అనే వెబ్ సైట్ లోకి వెళ్లి రూ.999 చెల్లించాలి. ఆ తర్వాత ‘లక్కీ విన్నర్’ డ్రా ద్వారా విజేతను నిర్ణయిస్తారు. మిగిలిన వారికి 'శ్రీమంతుడు' టీ-షర్ట్స్ ను అందిస్తారు. మహేశ్ బాబు చేతుల మీదుగా శ్రీమంతుడు సైకిల్ ను విజేతకు అందజేస్తామని ఫిల్మ్ మేకర్స్ వివరించారు.

  • Loading...

More Telugu News