: కళాశాలకు రూ. 653 కోట్లు విరాళమిచ్చిన ఇంద్రానూయి అక్కా, బావ


ప్రవాస భారతీయ జంట చంద్రికా, రంజన్ టాండన్ దంపతులు న్యూయార్క్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కు అత్యధిక మొత్తాన్ని దానంగా ఇచ్చిన వారిగా చరిత్రలో నిలిచారు. అంతేకాదు, ప్రవాస భారతీయుల్లో అత్యధిక మొత్తాన్ని ఉదారంగా దానమిచ్చిన భార్యాభర్తలుగా కూడా రికార్డు సృష్టించారు. ప్రముఖ పానీయాల దిగ్గజం పెప్సీకో చీఫ్ ఇంద్రానూయి అక్క, మెక్ కిన్సే మాజీ భాగస్వామి, ప్రముఖ సంగీత దర్శకురాలిగా ఉన్న చంద్రిక, తన భర్త రంజన్ తో కలసి ఈ స్కూలుకు 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 653 కోట్లు) విరాళంగా ఇవ్వగా, స్కూలు పేరును ఎన్ వైయూ టాండన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ గా మార్చాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ విషయాన్ని స్కూల్ డీన్ కేతేపల్లి శ్రీనివాసన్, ప్రెసిడెంట్ జాన్ సెటన్ తెలిపారు. వర్శిటీ అభివృద్ధికి మరో 50 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాలని భావిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News