: ఫ్రాన్స్ పర్యటనలో వెంకయ్యనాయుడుకి చేదు అనుభవం!


ఫ్రాన్స్ పర్యటనలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకి చేదు అనుభవం ఎదురైంది. అక్కడ జరిగిన ఒక సమావేశంలో పాల్గొనేందుకుగాను ఆయనకు విమానం టికెట్ బుక్ చేశారు. తీరా ఆయన బయలు దేరే సమయానికి ఆ టికెట్ రద్దయినట్లు తెలిసింది. దీంతో సుమారు 600 కిలోమీటర్లు రోడ్డుమార్గంలో ప్రయాణించి ఆ సమావేశానికి హాజరయ్యారు. ఈ విషయాన్ని వెంకయ్యనాయుడు ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఫ్రాన్స్ లోని బోర్డెక్స్ నగరంలో జరిగిన 22వ అంతర్జాతీయ ఇంటలిజెంట్ ట్రాన్స్ పోర్టు సిస్టమ్ వరల్డ్ కాంగ్రెస్ జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో ఆయన కోసం రిజర్వ్ చేసిన టికెట్ ను ఎయిర్ ఫ్రాన్స్ అధికారులు రద్దు చేశారు. దీంతో భారీ వర్షంలో దాదాపు ఆరువందల కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా ఆయన ప్రయాణించారు. ఎట్టకేలకు రౌండ్ టేబుల్ సమావేశానికి తాను హాజరైనట్లు వెంకయ్య పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఫ్రాన్స్ రవాణా మంత్రి అలెన్, వెంకయ్యనాయుడుకి క్షమాపణ చెప్పారు. ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఫ్రాన్స్ మంత్రి చెప్పారని ట్విట్టర్లో వివరించారు.

  • Loading...

More Telugu News