: సీఆర్ డీఏ కార్యాలయంలో రాజధాని శంకుస్థాపన నిర్వహణ కమిటీ భేటీ


విజయవాడలోని సీఆర్ డీఏ కార్యాలయంలో రాజధాని శంకుస్థాపన కమిటీ భేటీ అయింది. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న కమిటీ భేటీలో కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, సీఆర్ డీఏ కమిషనర్ హాజరయ్యారు. వారితో పాటు ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే శ్రవణ్ పాల్గొన్నారు. రాజధాని శంకుస్థాపన నిర్వహణపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ నెల 22న జరిగే రాజధాని శంకుస్థాపనకు అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 250 ఎకరాలను రాజధాని శంకుస్థాపనకు సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శంకుస్థాపన కోసం ఉద్దండరాయునిపాలెంలో భూమిని అధికారులు ఖరారు చేశారు. ఇక 50 ఎకరాల్లో బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ వేడుకను లక్షమంది వీక్షించేలా ఏర్పాట్లు చేయనున్నారు.

  • Loading...

More Telugu News