: సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న హార్దిక్ పటేల్ వీడియో


పటేల్ పాటీదార్ అనామత్ సమితి అధ్యక్షుడు హార్దిక్ పటేల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. సూరత్ జిల్లాలోని గోసామాడా గ్రామంలో నిర్వహించిన డ్రయో కార్యక్రమలో హార్దిక్ పటేల్ ప్రసంగించాడు. ఈ సందర్భంగా ఆయన మద్దతుదారులు నోట్ల వర్షం కురిపించారు. అలా నోట్ల వర్షం కురవడంతో స్టేజీ మొత్తం నోట్లతో నిండిపోయింది. ఈ దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. డ్రయో వంటి జానపద కార్యక్రమాల్లో డబ్బులు వెదజల్లడం సర్వసాధారణమని హార్దిక్ అనుచరుడు పేర్కొనగా, నెటిజన్లు మండిపడుతున్నారు. అంత డబ్బు ఉన్నప్పుడు రిజర్వేషన్లు ఎందుకు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News