: గెలిపిస్తే గోవధను నిషేధిస్తాం: సుశీల్ మోదీ
బీహార్ లో బీజేపీని గెలిపిస్తే గోవధపై నిషేధం విధిస్తామని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుశీల్ మోదీ తెలిపారు. బీహార్ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియాలో వీడియో సందేశం ఉంచారు. గోవధను నిషేధించడం ద్వారా వేలాది గోవులను రక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారని అన్నారు. తన చర్యల ద్వారా ఆవుల అక్రమ రవాణాకు మోదీ అడ్డుకట్ట వేశారని ఆయన చెప్పారు. ఆవులను రక్షించడం ద్వారా గోపాలకుల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావాలని ప్రధాని భావిస్తున్నారని ఆయన తెలిపారు.