: రూ. 4,147 కోట్ల నల్లధనం వెల్లడైంది!: కేంద్రం


ఎలాంటి కేసులు లేకుండా నల్లధనం వివరాలను వెల్లడించడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన 90 రోజుల గడువు సెప్టెంబర్ 30 అర్ధరాత్రితో ముగిసింది. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం రూ. 4,147 కోట్ల నల్లధనం వసూలైందని కేంద్రం ప్రకటించింది. రూ. 3,770 కోట్ల నల్లధనం లెక్కలోకి వచ్చిందని ఇంతకు ముందు చెప్పిన కేంద్రం... అది ప్రాథమికంగా లెక్కించిన మొత్తం మాత్రమే అని స్పష్టం చేసింది. సీల్డు కవర్ల ద్వారా వచ్చిన డిక్లరేషన్స్ కూడా లెక్కించిన తర్వాత ఈ మొత్తం రూ. 4,147 కోట్లకు చేరుకుందని, తమ నల్లధనాన్ని వెల్లడించడానికి మొత్తం 638 మంది ముందుకు వచ్చారని తెలిపింది. అక్టోబర్ 1న వివరాలను వెల్లడించిన సమయానికే ఎన్వలప్ లలోని డిక్లరేషన్ లను లెక్కించడం జరిగిందని... కాకపోతే, ఆ మొత్తాన్ని ప్రకటించలేదని కేంద్ర రెవెన్యూ సెక్రటరీ హష్ముక్ అధియా తెలిపారు. ఇప్పుడు వెల్లడించిన ఈ నల్లధనం ద్వారా రూ. 2,488.20 కోట్ల పన్ను ఖజానాకు వస్తుందని చెప్పారు. విదేశాలలో తాము దాచుకున్న నల్లధనాన్ని ఈ మూడు నెలల కాలంలో వెల్లడించిన వారికి ఎటువంటి క్రిమినల్ కేసులూ లేకుండా, 60 శాతం పన్ను మాత్రం విధిస్తారు. ఈ గడువు తర్వాత కొత్తగా తెచ్చిన నల్లధనం చట్టం అమలులోకి వస్తుంది.

  • Loading...

More Telugu News