: సాగరమాల ప్రాజెక్టును చేపట్టినందుకు మోదీకి కృతజ్ఞతలు చెబుతున్నా: చంద్రబాబు


సాగరమాల ప్రాజెక్టును మళ్లీ కేంద్ర ప్రభుత్వం చేపట్టినందుకు ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. మాజీ ప్రధాని వాజ్ పేయి హయాంలోనే ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని, కానీ తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఢిల్లీలో ఇవాళ సాగరమాల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు. అది ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాగరమాల ప్రాజెక్టుతో రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు. దాని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News