: ‘బంగ్లా’ ఉగ్రవాదికి భారత్ లో ఆధార్ కార్డ్!


బంగ్లాదేశ్ కు చెందిన తారిఖుల్ ఇస్లాం అనే ఉగ్రవాదికి భారత్ లో ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. బంగ్లాదేశ్ కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉల్ ముజాహిదీన్ తో తారిఖ్ కు ప్రత్యక్ష సంబంధాలున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. బుర్ద్వాన్ పేలుళ్లతో సంబంధం ఉన్నట్లు అనుమానించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయం బయటపడింది. బుర్ద్వాన్ పేలుళ్లకు, తనకు ఏమీ సంబంధం లేదంటూ గతవారం జార్ఖండ్ లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారుల విచారణలో బుకాయించాడు. ఆ తర్వాత లోతుగా విచారించడంతో వివరాలు చెప్పాడు. తారిఖుల్ భారతీయుడిగా గుర్తింపు పొందడం కోసం పలు ప్రయత్నాలు చేశాడని, పలువురు అధికారులకు పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చాడని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News