: హార్దిక్ పై నోట్లు విరజిమ్మిన అభిమానులు!
గుజరాత్ లో పటేల్ కులస్థుల యువసారథి హార్దిక్ పటేల్ పై డబ్బు నోట్ల వర్షం కురిసింది. పటేళ్ల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న హార్దిక్ కు సూరత్ లో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హార్దిక్ మాట్లాడుతున్నంత సేపూ ఆయనపై అభిమానులు డబ్బు నోట్లు విరజిమ్మారు. ఆయనొక్కడి పైనే కాకుండా సభా వేదికపై ఉన్న వారందరిపై కూడా నోట్లు వెదజల్లారు. కాగా, హార్దిక్ అభిమానులు అత్యుత్సాహం కనపరిచారని కొందరు విమర్శిస్తున్నారు. ‘మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, కావాలంటే పోలీసులను హతమార్చండి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హార్దిక్ పై పలువురు మండిపడుతున్న విషయం తెలిసిందే.