: అమరావతి కోసం సిడ్నీలో ఉంటున్న తెలుగు ప్రజలు ప్రత్యేక పూజలు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం తలపెట్టిన శంకుస్థాపన కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలూ రాకూడదని ఆస్రేలియా ప్రముఖ నగరం సిడ్నీలో నివాసం ఉంటున్న తెలుగు ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజధానికి మంచి కంపెనీలు వచ్చి, యువతకు ఉద్యోగాలు రావాలని కోరుతూ నవధాన్యాలు నింపిన కలశాలకు పూజలు జరిపారు. దీన్ని శంకుస్థాపన నాటికి అమరావతికి తీసుకురానున్నామని వెల్లడించిన సిడ్నీ తెలుగు వాసులు, ఏపీ రాజధాని నిర్మాణానికి శ్రమిస్తున్న చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.