: డీకే అరుణకు తెలంగాణ సర్కారు ఝలక్!
హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్టులోని పెట్రోలు బంకు పక్కన, కాంగ్రెస్ నేత డీకే అరుణ తనదిగా చెప్పుకుంటున్న రూ. 40 కోట్ల విలువైన స్థలాన్ని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సర్కిల్ 10 టౌన్ ప్లానింగ్ అధికారులు 400 గజాల అత్యంత విలువైన స్థలంలోని నిర్మాణాలను కూలగొట్టారు. ఏసీపీ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కూల్చివేతలు సాగగా, అరుణ సంబంధీకులు, అనుచరులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా, ఈ స్థలం సొసైటీ లే అవుట్ లో ఖాళీగా ఉందని తాము గుర్తించినట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. దీనితో సొసైటీకి, అరుణ భర్త భరతసింహారెడ్డికి ఎలాంటి హక్కులూ లేవని వివరించారు. కాగా, ఈ స్థలం తమదేనని భరతసింహారెడ్డి, జూబ్సీహిల్స్ సొసైటీలు కోర్టులో కేసులు వేసిన సంగతి తెలిసిందే.