: ఢిల్లీలో పురుషులపై కూడా వేధింపులు ఎక్కువే


రేప్ ల కేంద్రంగా పేరుపడిన దేశ రాజధానిలో పురుషులపై కూడా వేధింపులు ఎక్కువేనని ఓ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. సదరు స్వచ్ఛంద సంస్థ సరిగ్గా ఏడాది క్రితం ఏర్పాటు చేసిన ఓ హెల్ప్ లైన్ నెంబర్ కు దేశ వ్యాప్తంగా 40 స్వచ్ఛంద సంస్థల ద్వారా 37 వేల వేధింపుల ఫిర్యాదులు అందాయని తెలిపింది. వీటిలో కొన్ని బోగస్ కాల్స్ వున్నప్పటికీ రోజూ వందకు పైగా నిజమైన వేధింపుల ఫిర్యాదులు అందుతున్నాయని ఈ స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. రోజూ వస్తున్న 110 కాల్స్ లో 60 నుంచి 70 శాతం ఫాల్స్ రేప్, ఫాల్స్ డౌరీ కేసులేనని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఎక్కువ వేధింపులపై ఫిర్యాదులు వస్తున్నట్టు వారు వివరించారు. ఢిల్లీలో 498-ఏ దుర్వినియోగమవుతోందని సదరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఢిల్లీలో ఓ వ్యక్తిని వేధించేందుకు అతని భార్య, అతను పని చేసే సంస్థకు ఫోన్ చేసి, అతనిపై గృహ హింస కేసు నమోదు చేసినట్టు సమాచారం ఇచ్చిందట, వెంటనే అతనిని రాజీనామా చేయాలని సదరు సంస్థ ఆజ్ఞాపించింది. ఇలా ఢిల్లీలో పురుషులపై వేధింపులు పెరిగిపోతున్నాయని సదరు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

  • Loading...

More Telugu News