: లవ్ లాక్ వంతెనకు తాళమేసిన అనుష్క శర్మ...ప్రియుడెవరు?


లవ్ లాక్ వంతెనకు బాలీవుడ్ నటి అనుష్క శర్మ తాళం వేసింది. ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో లవ్ లాక్ వంతెన ఉంది. ఆ వంతెనకు ప్రియుడు, ప్రియురాలి పేరు రాసిన తాళం కప్పవేసి తాళం చెవిని ఆ నది నీటిలోకి విసిరేస్తారు. అలాగే టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మ ఆ బ్రిడ్జ్ కి తాళం వేసింది. అయితే ఆ తాళంపై తనపేరుతో పాటు డ్యూడ్ అని రాసింది. ఈ ఫోటోను ఇన్ స్టాగ్రాంలో పోస్టు చేసింది. లవర్స్ బ్రిడ్జ్ కు తాళం వేసి, కోహ్లీ పేరు కాకుండా డ్యూడ్ అని రాసింది. ఇంతకీ డ్యూడ్ ఎవరా? అని అంతా ఆరాతీయగా, ఆ పేరు అనుష్క శర్మ కుక్కది అని తేలింది. ఆ కుక్క అంటే అనుష్కకి చాలా ఇష్టమట!

  • Loading...

More Telugu News