: మోదీకి ధన్యవాదాలు తెలిపిన సుష్మాస్వరాజ్
భారత ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని వ్యాఖ్యలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కొనియాడారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సుష్మ మాట్లాడుతూ, తీవ్రవాదంపై పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ, సుష్మాస్వరాజ్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఈ నేపథ్యంలో, ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ సుష్మ ట్వీట్ చేశారు.