: ఇకపై కండోమ్ ప్రకటనలు రాత్రిపూటే!
టీవీలలో కండోమ్ ప్రకటనలు ఇకపై పగటి పూట ప్రదర్శించకుండా, కేవలం రాత్రి పూట మాత్రమే ప్రసారం చేసేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనను తీసుకురానుంది. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్యలో టీవీలలో కండోమ్ ప్రకటనలు వేసుకునేలా కేంద్రం చర్యలు తీసుకోనుంది. టీవీ ప్రసారాల మధ్యలో అకస్మాత్తుగా ప్రసారమవుతున్న కండోమ్ ప్రకటనలపై పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ప్రైమ్ టైమ్ అంటే సాయంత్రం ఇంటిల్లపాది సీరియల్స్ చూస్తుండగా, విరామ సమయాల్లో అకస్మాత్తుగా కండోమ్ ప్రకటనలు ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో కుటుంబ సభ్యులంతా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. వీటిపై కేంద్ర ప్రభుత్వానికి చాలా ఫిర్యాదులందాయి. అలాగే ఈ మధ్య కాలంలో సన్నీలియోన్ నటించిన కండోమ్ యాడ్ పై రాజకీయ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నిజానికి కండోమ్ యాడ్స్ ను నిషేధించాలనే ప్రతిపాదన ఉన్నా, లేట్ అవర్స్ కు పరిమితం చేసేలా కేంద్రం చర్యలు తీసుకోనుందని సమాచారం.