: మహీంద్రా యాడ్ లో యంగ్ రెబల్ స్టార్...ఆకట్టుకుంటున్న వాణిజ్య ప్రకటన
‘బాహుబలి’తో ఇండియన్ సినీ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా దేశీయ వాహనాల తయారీ కంపెనీ ‘మహీంద్రా’ యాడ్ తో దూసుకొచ్చాడు. ప్రస్తుతం టీవీ చానెళ్లలో ప్రసారమవుతున్న ఆ కంపెనీ కొత్త వాహనం ‘ఎస్ యూవీ 300’ యాడ్ కు ప్రభాస్ సరికొత్త ఇమేజ్ ఇచ్చాడు. నిమిషం నిడివి ఉన్న ఈ యాడ్ లో ప్రభాస్ కేవలం పది సెకన్ల కంటే తక్కువ సమయమే కనిపించినా, ఫుల్ జోష్ తో కొత్త లుక్ లో కనిపించాడు. కొత్త కారులాగే ఈ యాడ్ లో ప్రభాస్ కూడా సరికొత్తగా కనిపిస్తున్నాడు. ప్రభాస్ లుక్ తో తమ కొత్త కారు విక్రయాలు ఊపందుకుంటాయన్న విశ్వాసాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా వ్యక్తం చేశారు. ప్రభాస్ తాజా చిత్రం ‘బాహుబలి’ పేరును ప్రస్తావించిన ఆయన తన కంపెనీ కొత్త కారునూ ‘బాహుబలి’గా అభివర్ణించారు. ‘బాహుబలిలో బాహుబలి’ అంటూ ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఈ యాడ్ ను పోస్ట్ చేశారు.