: కేజ్రీవాల్ కి చేదు అనుభవం... గ్రామంలోకి అనుమతించని స్థానికులు
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఈ ఉదయం చేదు అనుభవం ఎదురైంది. ఉత్తరప్రదేశ్ లోని బిషాదా గ్రామంలో 50 ఏళ్ల మొహమ్మద్ ను గోమాంసం తిన్నాడన్న కారణంతో కొందరు స్థానికులు కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు కేజ్రీవాల్ ఆ గ్రామానికి వెళ్లారు. అయితే, గ్రామంలోకి ప్రవేశించకుండా, కేజ్రీవాల్ ను స్థానికులు అడ్డుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ గ్రామంలోకి ఎవర్నీ అనుమతించమని చెప్పారు. రాజకీయ నేతల రాకతో గ్రామంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు. దీంతో, కేజ్రీవాల్ వెనుదిరిగారు. అనంతరం ఈ విషయంపై ఆయన ట్విట్టర్లో స్పందించారు. తనను గ్రామంలోకి వెళ్లకుండా అడ్డుకోవడం చాలా దారుణమని తెలిపారు. "పోలీసులు, అధికారులే నన్ను అడ్డుకున్నారు. మహేష్ శర్మ, ఒవైసీలను నిన్న ఎందుకు ఆపలేదు? నన్నే ఎందుకు ఆపారు? శాంతిని ఇష్టపడే వ్యక్తిని నేను. మొహమ్మద్ కుటుంబాన్ని నేను కలవాలనుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు.