: వైకాపా నేతలను అడ్డుకుంటున్న పోలీసులు... ఉద్రిక్తత


విశాఖపట్నం జిల్లా పాలవలసలోని హిందూజా పవర్ ప్లాంట్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పవర్ ప్లాంట్ నిర్వాసితులు, స్థానిక గ్రామస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ, వైకాపా ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో, ప్లాంట్ వద్ద ధర్నాకు వైకాపా శ్రేణులు యత్నించాయి. దీంతో, వైకాపా నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అప్పికొండ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. పలు ప్రాంతాల నుంచి వస్తున్న వైకాపా నేతల వాహనాలను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో, పోలీసులకు వైకాపా నేతలకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

  • Loading...

More Telugu News