: నెత్తురు పారని తెలంగాణనే కోరుకుంటున్నాం!: టీఎస్ మంత్రి కేటీఆర్


తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా మొద్దుగుట్ట ఎన్ కౌంటర్ పై నిన్నటిదాకా విపక్షాలు, ప్రజా సంఘాలు చేస్తున్న ఆరోపణలపై కిమ్మనని ఆయన నేటి ఉదయం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాము అమలు చేస్తోంది నక్సల్స్ పాలనేనని ఆయన పేర్కొన్నారు. మావోయిస్టులు ఆకాంక్షిస్తున్న సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం తీవ్రంగా యత్నిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. నెత్తురు పారని తెలంగాణను తాము కోరుకుంటున్నామని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణకు సాయం చేయడంలో కేంద్రం పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు అందిస్తున్న తరహాలోనే తెలంగాణకు కూడా కేంద్రం ఆర్థిక సాయం చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News